Skip to main content

Namaste NRI

మరో క్రేజీ డైరెక్టర్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన బన్నీ

పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో చేస్తారు? అనే విషయంపై రకరకాల పేర్లు కొన్ని నెలలుగా వినిపిస్తూనే ఉన్నాయి. మొదట్లో త్రివిక్రమ్‌ పేరు బాగా వినపడింది. ఆ తర్వాత అట్లీ పేరు. ఇప్పుడు నెల్సన్‌ పేరు వీరిద్దరికంటే ఎక్కువగా వినిపిస్తున్నది. జైలర్‌ సినిమాతో అఖండ విజయాన్ని అందుకున్నారు నెల్సన్‌. ఆరు నెలల క్రితమే అల్లు అర్జున్‌కి నెల్సన్‌ కథ వినిపించారట.  కథ నచ్చడంతో బన్నీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌లో నెల్సన్‌ బిజీగా ఉన్నట్టు సమాచారం. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సమపాళ్లలో ఉండే కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాను పాన్‌ఇండియా స్థాయిలో నిర్మించనున్నారట నిర్మాత నల్లమలపు బుజ్జి. పుష్ప 2 తర్వాత బన్నీ చేసే సినిమా ఇదేనని ఫిల్మ్‌ వర్గాల వినికిడి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Social Share Spread Message

Latest News