Skip to main content

Namaste NRI

విజయ్‌ దేవరకొండ తాజా చిత్రం… కేరళలో షూటింగ్‌ పూర్తి

విజయ్‌ దేవరకొండ హీరోగా,  గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం వీడీ 12.  వీడీ 12 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు. కేరళ షెడ్యూల్‌లో యాక్షన్‌ ఘట్టాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ మీట్‌లో మాట్లాడారు. కేరళలోని ప్రకృతి అందాలు తనను మెస్మరైజ్‌ చేశాయని, ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని, అభిమానులకు మంచి జ్ఞాపకాలను అందిస్తుందని చెప్పారు.

విధి పిలిచింది. రక్తపాతం ఎదురుచూస్తోంది అనే క్యాప్షన్‌తో గతంలో విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ప్రస్తుతం అరవైశాతం చిత్రీకరణ పూర్తయిందని, పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని, విజయ్‌ పాత్ర గత సినిమాలకు భిన్నంగా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. మార్చిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News