Skip to main content

Namaste NRI

నాలుగు నెలల్లో ఇది రెండోసారి… మళ్లీ రష్యాకు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు కజాన్‌ లో ఈనెల 22 నుంచి 24 వరకూ జరగనున్న 16వ బ్రిక్స్‌ సమ్మిట్‌ లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌ 22 నుంచి 23 వరకూ రష్యాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా మోదీ, బ్రిక్స్‌ సభ్యదేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని పేర్కొంది. కాగా, నాలుగు నెలల్లో ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులై 8 – 9 తేదీల్లో ఆయన రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News