Namaste NRI

ప్ర‌ధాని ట్రూడో కీల‌క వ్యాఖ్య‌లు… కెన‌డాలో

కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో  కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒట్టావా పార్ల‌మెంట్ హిల్‌లో జ‌రిగిన దీపావ‌ళి కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఆయ‌న మాట్లాడుతూ  కెన‌డాలో ఖ‌లిస్తానీ మ‌ద్ద‌తుదారులు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. కానీ ఆ ఖ‌లిస్తానీ స‌పోర్ట‌ర్లు, సిక్కు మ‌త‌స్థుల స‌మూహానికి ప్రాతినిధ్యం వ‌హించ‌ర‌ని పేర్కొన్నారు. కెన‌డాలో ఖ‌లిస్తానీ మ‌ద్ద‌తుదారులు ఉన్న‌ట్లు ట్రూడో తొలిసారి బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త వారం బ్రాంప్ట‌న్‌లోని ఓ ఆల‌యంలో హిందూ భ‌క్తుడిపై ఖ‌లిస్తానీ తీవ్ర‌వాదులు దాడి చేశారు. ఆ స‌మ‌యంలో భారీ స్థాయిలో నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. అయితే ఆ ఘ‌ట‌న‌ను ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో ఖండించారు. కెన‌డాలో ప్ర‌తి ఒక్క‌రు స్వేచ్ఛ‌గా త‌మ మ‌త విశ్వాసాల‌ను పాటించ‌వ‌చ్చు అన్నారు. ఆ ఘ‌ట‌న‌పై త‌క్ష‌ణ‌మే ద‌ర్యాప్తు చేప‌ట్టిన స్థానిక అధికారుల‌కు ఆయ‌న థ్యాంక్స్ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress