
అక్కినేని వారి ఇల్లు కల్యాణకాంతులతో వెలుగులీనింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహబంధంలోకి అడుగుపెట్టారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి, హీరో కార్తి, రామ్‌చరణ్, రానా, నాని, కీరవాణితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చైతన్య, శోభిత తమ జీవితంలో అందమై న అధ్యాయాన్ని మొదలుపెట్టారు. నాకిది భావోద్వేగభరితమైన క్షణం. శోభితను మా అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. నాన్న ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహం ముందు ఈ పెళ్లి వేడుక జరగడం గొప్ప సంతోషాన్నిస్తోంది అని నాగార్జున పేర్కొన్నారు
