Skip to main content

Namaste NRI

అంతరిక్ష కేంద్రంలో… 8.5 లక్షల కోట్లతో 

అంతరిక్ష వాణిజ్యంలో అపర కుబేరుల హవా నడుస్తున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కక్ష్య నుంచి సురక్షితంగా తొలగించే కాంట్రాక్టును ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ దక్కించుకోగా, కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ తీసుకుంది. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) కాలపరిమితి ముగుస్తున్నది. 2031 నాటికి ఐఎస్‌ఎస్‌ కార్యకలాపాలు ముగుస్తాయి.

ఈ నేపథ్యంలో కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను బ్లూ ఆరిజిన్‌ సంస్థకు నాసా అప్పగిం చింది. ఆర్బిటల్‌ రీఫ్‌ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త అంతరిక్ష కేంద్రం 8,200 క్యూబిక్‌ అడుగుల స్థలంలో ఉంటుంది. ఇది మొట్టమొదటి ప్రైవేటు అంతరిక్ష కేంద్రంగా నిలవనుంది. 2027లో దీనిని ప్రయోగించాలని, 2030 నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News