Skip to main content

Namaste NRI

సామాన్యుడితో లోపలికి రా చెప్తా .. సాంగ్ లాంచ్

కొండా వెంకటరాజేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న హారర్‌ కామెడీ డ్రామా లోపలికి రా చెప్తా. మనీషా జష్మాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్‌ కీలక పాత్రధారులు. లక్ష్మీగణేశ్‌, వెంకటరాజేంద్ర నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రమోషన్‌లో భాగంగా సినిమాలోని తొలిపాటను మేకర్స్‌ విడుదల చేశారు. డెలివరీ బోయ్‌ జాఫర్‌ ఈ పాటను విడుదల చేయడం విశేషం.

ఈ కథలో హీరో డెలివరీ బోయ్‌. అందుకే మొదటి పాటను డెలివరీ బోయ్‌తో విడుదల చేయించాం. డేవ్‌ జాండ్‌ సంగీత దర్శకత్వంలో కపిల్‌ కపిలన్‌ పాడిన ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని నటుడు, దర్శక, నిర్మాత వెంకటరాజేంద్ర తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రేవంత్‌ లేవాక, అరవింద్‌ గణేశ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events