ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకురాలు. నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. జనవరి 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను అగ్ర నటుడు మహేష్‌బాబు విడుదల చేశారు. అందరి మనసులకు హత్తుకునే సినిమా ఇదని, సుకృతివేణితో పాటు టీమ్ అందరికి మహేష్‌బాబు అభినందనలు తెలిపారు.
గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ ఆయన బాటలో నడిచే ఓ పాఠశాల విద్యార్థిని తన తాతకు ఇష్టమైన చెట్టును, ఊరిని ఎలా రక్షించుకుందనే సందేశాత్మక ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతున్నది. ప్రపంచమంతటా అసూయద్వేషాలు పెరిగి పోయిన ప్రస్తుత తరుణంలో గాంధీజీ సిద్ధాంతాలను పాటించే ఓ పద మూడేళ్ల అమ్మాయి కథగా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని దర్శకురాలు పద్మావతి మల్లాది పేర్కొన్నా రు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీజిత్ చెర్వుపల్లి, సంగీతం: రీ, రచన-దర్శకత్వం: పద్మావతి మల్లాది.