రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ భారీ అంచనాల నడుమ విడుదల చేశారు. భారత దేశంలో రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకీ రామాయణం గురించి అనేక సినిమాలు వచ్చినా, ఇది ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైలర్లో విజువల్స్ చాలా బాగున్నాయి. యుద్ధ సన్నివేశాలు చూస్తే, ఆ రోజుల్లో అయోధ్యలో జరిగిన ఘట్టాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఈ ట్రైలర్లో చూపించిన అయోధ్య, మిథిలా నగరాలూ, పంచవటి అడవి ప్రాంతం, సీతారాములు అరణ్యవాసం చేసిన ప్రదేశాలు మొదలగు నవి అన్నీ సహజంగా అనిపిస్తున్నాయి. యుగో సాకో, కోయిచి ససకి మరియు రామ్ మోహన్లు అందరూ కలిసి ఈ సినిమా ని మన ముందుకు తీసుకొస్తున్నారు. దాదాపుగా 450 ఆర్టిస్ట్స్, ఒక లక్ష మంది హ్యాండ్ డ్రాన్ సేల్స్ ద్వారా ఈ విజువల్ మాస్టర్ పీస్ ని రూపొందించారు.
రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు తెలుగులో డైలాగ్స్ రాశారు.ఇప్పుడు సినిమాని ఇండియాలో రిలీజ్ చేస్తున్న నిర్మాత అర్జున్ అగర్వాల్ మాట్లాడుతూ ఇండియన్ హెరిటేజ్ ని గొప్ప గా సెలబ్రేట్ చేసుకొనే విధంగా ఈ రామాయణం సినిమాని రూపొందించారు. కచ్చితంగా థియేటర్స్ లో ఈ సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు అని అన్నారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రామాయణం కథ ఎంతో మంది భారతీయుల్ని కదిలించింది. ఇంతకు మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమా ఉంటుంది అని అన్నారు.