Skip to main content

Namaste NRI

ఇట్స్ ఓకే గురు సినిమా నుంచి నిలవదే నిలవదే లిరికల్ సాంగ్ రిలీజ్

చరణ్సాయి, ఉషశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ఇట్స్ ఓకే గురు. మణికంఠ.ఎం దర్శకుడు. సురేష్ అనపురపు, బస్వ గోవర్థన్గౌడ్ నిర్మాతలు. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని పాటను మేకర్స్ విడుదల చేశారు. నిలవదే నిలవదే.. ఎదురుగా నా మది అంటూ సాగే ఈ గీతాన్ని లక్ష్మీప్రియాంక రాయగా, మోహిత్ రెహ్మానియక్ స్వరపరచగా, సిద్ధార్థ్ మీనన్ ఆలపించారు. ప్రేమభావాలను వ్యక్తపరిచేలా రూపొందిన ఈ మెలోడీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. సుధాకర్ కోమాకుల కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి మాటలు: కడలి సత్యనారాయణ, చైతన్య, కెమెరా, ఎడిటింగ్: సన్నీ.డి, నిర్మాణం: వండర్ బిల్ట్ ఎంటైర్టెన్మెంట్స్.

Social Share Spread Message

Latest News