
రవిప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ విద్రోహి. వీఎస్ వీ దర్శకత్వంలో విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం, పప్పుల కనకదుర్గారావు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని హీరో శ్రీకాంత్ లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.ఇందులో ప్రతి పాత్రా ఆకట్టుకునేలా ఉంటుందని, సరికొత్త పాయింట్‌తో రూపొందుతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇదని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.
