Namaste NRI

భారతీయ అమెరికన్ కు అరుదైన గౌరవం

అమెరికాలోని హూస్టన్‌లో 2019లో దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ అమెరికన్‌ పోలీస్‌ అధికారి సందీప్‌ సింగ్‌ ధలీవాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. వెస్ట్‌ హూస్టన్‌లోని ఓ పోస్టాఫీస్‌కు ధలీవాల్‌ పేరు పెట్టారు. 2019 సెప్టెంబర్‌ 27న ధలీవాల్‌ ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో ధలీవాల్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్‌ సభ్యురాలు లిజీ ఫ్లేచర్‌ ధలీవాల్‌ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ధలీవాల్‌ ప్రాణ త్యాగానికి గుర్తుగా వెస్ట్‌ హూస్టన్‌ పోస్టాఫీస్‌కు ఆయన పేరు పెడుతున్నట్లు ఆమె ప్రకటించారు.            

     దీంతో 315 అడ్డిక్స్‌ హోవెల్‌ రోడ్‌లోని పోస్టాఫీస్‌ ఇకపై ధలీవాల్‌ పేరుతో పిలవబడనుంది. ధలివాల్‌ ముగ్గురు పిల్లలు.  2015లో తొలిసారి ధలీవాల్‌ తలకు పాగ, గడ్డంతో పోలీస్‌ విధులు నిర్వహించి అమెరికాలో వార్తల్లోకి ఎక్కారు. ఇకా టెక్సాప్‌ డిప్యూటీ పోలీస్‌ అధికారిగా తలకు టర్బన్‌, గడ్డంతో విధులు నిర్వహించి ధలీవాల్‌ చరిత్ర సృష్టించాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events