విదేశీయులకు నవంబర్ 15 నుంచి కేంద్ర ప్రభుత్వం పర్యాటక వీసాలను మంజూరు చేయనున్నది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు అక్టోబర్ 15 నుంచి చార్టర్డ్ విమానాల ద్వారా భారతదేశానికి వచ్చే విదేశీయులకు తాజా టూరిస్ట్ వీసాలను మంజూరు చేయడం ప్రారంభిస్తారు. అయితే చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ కాకుండా ఇతర విమానాల ద్వారా ప్రయాణించే విదేశీ పర్యాటకులకు నవంబర్ 15 నుంచి వీసాలు ఇస్తారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన అన్ని కొవిడ్ 19 మార్గదర్శకాలు, నిబంధనలను విదేశీ పర్యాటకులు, భారతదేశంలోకి తీసుకువచ్చే క్యారియర్లు, ల్యాండిరగ్ స్టేషన్లలో ఇతర వాటాదారులు తప్పనిసరిగా పాటించాలని వెల్లడిరచింది.
కొవిడ్`19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విదేశీ పర్యాటకులకు మంజూరు చేసిన అన్ని వీసాలను కేంద్ర హోంశాఖ గత ఏడాది నిలిపివేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలపై అనేక ఇతర ఆంక్షలు కూడా విధించింది. కొవిడ్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అనంతరం విదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించేందుకు, ఉండేందుకు టూరిస్ట్ వీసా కాకుండా ఇతర భారతీయ వీసాలను పొందేందుకు అనుమతించారు.














