Namaste NRI

ఘనంగా ప్రారంభమైన తానా గ్రంధాలయం

(వర్జీనియా) : తానా ఎంతో ప్రతిష్టాత్మకంగా  తలపెట్టిన గ్రంధాలయం చాల అట్టహాసంగా ప్రారంభమైనది . ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున చిన్నారులు మహిళలు కూడా పాల్గొనటం విశేషం. సుమారు వెయ్యి కి పైగా పుస్తకాలతో వర్జీనియా తెలుగు ప్రజలకి అందుబాటులో ఉండటంపై కార్యక్రమానికి హాజరైన పెద్దలు హర్షం వెలిబుచ్చారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తానా పూర్వపు బోర్డు అఫ్ డైరెక్టర్స్ చైర్మన్  డా. హేమ ప్రసాద్ యడ్ల గారు తానా సజీవ చరిత్ర( నరిశెట్టి ఇన్నయ్య గారు రచించిన)  పుస్తకాన్ని ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి ప్రత్యేక గ్రంధాలయం 40 ఏళ్ళ కల అని దానిని వాస్తవ రూపంలోకి తీసుకు వచ్చిన తానా కాపిటల్ రీజియన్ సభ్యులందరినీ  ప్రత్యేకంగా అభినందించారు. వర్జీనియా, మేరీల్యాండ్ మరియు వాషింగ్టన్ డి.సి లో ఉన్న తెలుగు ప్రజలందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.   తానా రీజినల్ కోఆర్డినేటర్ శ్రీ ఉయ్యురు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ గ్రంధాలయం ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది అని వీకెండ్ లో చిన్నారులకి పెద్దలకి  పుస్తక పఠనం, కథా చర్చలు తదితర  ప్రత్యేక కార్యక్రమాలతో పాటు చిన్నారులకి ప్రత్యేకంగా గ్రూప్ డిస్కషన్, ఇన్డోర్ గేమ్స్ అందుబాటులో ఉంటాయి ఇది తొలి అడుగు మాత్రమే మున్ముందు  మరిన్ని వినూత్న కార్యక్రమాలు, వసతులు తెలుగు వారికి అందుబాటులోకి తీసుకువస్తామని దీనికి మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి అని విజ్ఞప్తి చేసారు భావితరపు తెలుగు యువత  మరియు  మహిళలు ఈ గ్రంధాలయ  నిర్వహణకు స్వచ్ఛందంగా   తమవంతు  సహకారం చెయ్యటానికి ముందుకు రావటం విశేషం. అన్ని తరాలకు అనుసంధాన వేదికగా ఈ ప్రాంగణం  ఉపయోగపడుతుంది అని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమం  ఇంత ఘనంగా నిర్వహించటానికి సహకరించిన పలు ప్రాంతీయ తెలుగు సంస్థల ప్రతినిధులకి , విచ్చేసిన తెలుగు సాహితి ప్రియులకి , చిన్నారులకి , మహిళలకు తానా గ్రంధాలయ నిర్వాహకులు ప్రత్యేక  ధన్యవాదములు తెలిపారు

ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన కాపిటల్ రీజియన్ తానా ప్రతినిధులకు మరియు తెలుగు సాహితి ప్రేమికులకు తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారు తానా లీడర్ షిప్ తరుపున ప్రత్యేక అభినందనలు తెలిపారు

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events