Skip to main content

Namaste NRI

దీపావళి సందర్భంగా.. మంచి రోజులు వచ్చాయి

ప్రస్తుతం గోపీచంద్‌ కథానాయకుడిగా పక్క కమర్షియల్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. మరో పక్క కరోనా విరామంలో కేవలం 40 రోజుల్లో పూర్తి చేసిన మంచి రోజులు వచ్చాయి చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. తదుపరి చిత్రం కోసం కూడా ఆయన పక్కా ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ర కథా నాయకుడు చిరంజీవి కోసం మారుతి కథని సిద్ధం చేసి వినిపించారని సమాచారం. ఆ కలయికలో సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి పుట్టినరోజు  సందర్భంగా కమర్షియల్‌ సెట్‌లో చిత్రబృందం సమక్షంలో వేడుక జరిగింది. ఈ వేడుకలో రాశీ ఖన్నా, గోపిచంద్‌, సత్యరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News