అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 15న విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అక్కినేని నాగచైతన్య, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, అల్లు అరవింద్, దర్శకులు హరిశ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు, టీజర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. అల్లు అరవింద్, బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా గీతా ఆర్ట్స్ 2 పతాకంపై నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.














