Skip to main content

Namaste NRI

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్

మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న భక్తిరసాత్మక చిత్రం కన్నప్ప. శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా ముఖేష్‌ కుమార్‌సింగ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత ఎం.మోహన్‌బాబు. మోహన్‌బాబుతోపాటు మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌, శరత్‌కుమార్‌ వంటి స్టార్‌ హీరోలు ఈ సినిమాలో భాగం కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల వల్ల సినిమాపై మంచి బజ్‌ ఏర్పడిందని మేకర్స్‌ చెబుతున్నారు.

కన్నప్ప కథకు అందరికీ చేరువ చేయాలనే తలంపుతో మంచు విష్ణు ఈ కథను కామిక్‌ సిరీస్‌గా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కి సంబంధించిన మొదటి రెండు ఎపిసోడ్‌లకూ మంచి స్పందన లభించిందని మేకర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా మూడో ఎపిసోడ్‌ని విడుదల చేశారు. తిన్నడులోని భావోద్వేగ, ఆధ్యాత్మిక పరివర్తనను ఈ చివరి ఎపిసోడ్‌ సూచిస్తుందని, నాస్తికుడైన తిన్నడు, ఆస్తికుడైన కన్నప్పగా ఎలా మారాడో ఈ ఎపిసోడ్‌ తెలియజేస్తుందని, ప్రేమ, భక్తి, త్యాగంతో నిండిన ఈ కథ అందర్నీ ఆకట్టుకుంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఏఐ ద్వారా క్రియేట్‌ చేసిన ఈ విజువల్స్‌ అందర్నీ అబ్బురపరుస్తాయని మేకర్స్‌ పేర్కొన్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ పాన్‌ ఇండియా సినిమా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events