Skip to main content

Namaste NRI

హరిహర వీరమల్లు..రిలీజ్ డేట్ ఫిక్స్

పవన్‌ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం  హరిహర వీరమల్లు.  నిధి అగర్వాల్‌ కథానాయిక. జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం.  ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని మేకర్స్‌ చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాలోని మూడో గీతం కూడా విడుదల కానున్నదని, అలాగే, ట్రైలర్‌ని కూడా విడుదల చేస్తామని, సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చేలా ట్రైలర్‌ ఉండబోతున్నదని వారు తెలిపారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఈ మూవీని జున్ 12 ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకున్నారు మేక‌ర్స్. జూన్ 12న‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాస్ విశ్వ‌రుపం చూడ‌డానికి సిద్ధంగా ఉండ‌డంటూ చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

ఈ చిత్రంలో  బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ, బాబీ డియోల్,  అనుపమ్‌ఖేర్‌, సత్యరాజ్‌, జిషు సేన్‌గుప్తా, నాజర్‌, సునీల్‌, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: మనోజ్‌ పరమహంస, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సమర్పణ: ఎ.ఎం.రత్నం, నిర్మాణం: మెగా సూర్య ప్రొడక్షన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events