Skip to main content

Namaste NRI

అమెరికా సాయం అక్కర్లేదు.. మేం చూసుకుంటాం

అఫ్గానిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌)ను కట్టడి చేయడానికి తమకు అమెరికా సాయం అక్కర్లేదని తాలిబన్లు స్పష్టం చేశారు. కతార్‌ రాజధానిలో దోహాలో తాలిబన్‌ నేతలు, అమెరికా మధ్య చర్చల నేపథ్యంలో తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహాయిల్‌ షహీన్‌ రాజీలేని ధోరణిని ప్రదర్శించారు. ఐసిస్‌ను కట్టడి చేయడానికి అమెరికాతో కలిసి పని చేస్తారా? అని అడిగినపుడు ఆయన స్పందిస్తూ ఐసిస్‌ను స్వతంత్రంగా ఎదర్కొనే సత్తా తమకు ఉందని చెప్పారు. అఫ్గానిస్తాన్‌లో  ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ 2014లో తూర్పు ఆఫ్గనిస్థాన్‌లో ఏర్పడిరది. ఇది ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పాటైంది. అప్పటి నుంచి షియాలపై దాడులు చేస్తోంది. అమెరికాన్‌ టార్గెట్లపై కూడా దాడి చేస్తోంది.

                 అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత తొలిసారి దోహాలో తాలిబన్లు అమెరికాన్లు చర్చలు జరుపుతున్నారు. తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించడానికి ముందు జరిగే  ప్రక్రియగా ఈ చర్చలను పరిగణించరాదని స్పష్టం చేసింది. పాకిస్థాన్‌ నేతలతో అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ వెండీ షెర్మన్‌ రెండు రోజులపాటు జరిపిన చర్చల నేపథ్యంలో తాలిబన్‌, అమెరికన్‌ ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయని తెలిసింది.

Social Share Spread Message

Latest News