Skip to main content

Namaste NRI

ప్రతిష్టాత్మక గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్ రేసులో భారతీయ విద్యార్థిని

ప్రతిష్టాత్మక గ్లోబల్‌ స్టూడెంట్‌ ప్రైజ్‌ 2021 టాప్‌ 10 ఫైనలిస్టుల జాబితాలో భారత విద్యార్థిని సీమా కుమారికి చోటు లభించింది. లండన్‌ లోని చెగ్‌ ఎడ్‌టెక్‌ సంస్థ నిర్వహించే ఈ పోటీకి 94 దేశాల నుంచి 3500కు పైగా నామినేషన్లు రాగా అందులో రaార్ఖండ్‌కు సీమా కుమారి  తుది 10 మంది జాబితాలో తీసుకున్నారు. విజేతకు లక్ష డాలర్ల నగదు బహుమతి లభించనుంది. భారత్‌లోని రaార్ఖండ్‌కు చెందిన సీమా కుమారి ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుతోంది. రaార్ఖండ్‌లోని ఆమె స్వగ్రామంలో బాల్య వివాహాలు సర్వసాధారణం. తల్లిదండ్రులు తనకు చిన్నప్పుడే తలపెట్టిన వివాహాన్ని ధైర్యంగా ఎదిరించి, చదువుపై ఆసక్తితో పాఠశాలలకు వెళ్లడం ప్రారంభించింది. యువ అనే మహిళా సాధికారత సంఘం ప్రోత్సాహం, ఆర్థిక సాయంతో హార్వర్డ్‌ యూనివర్సిటీలో చేరింది. టాప్‌ 10 ఫైనలిస్టులో తన పేరు ఉండడం పట్ల సీమా కుమారి ఆనందం వ్యక్తం చేసింది. ప్రతిభా పాటవాలతో సమాజంపై ప్రభావం చూపిన వారిని గ్లోబల్‌ స్టూడెంట్‌ ఫ్రైజ్‌తో సత్కరిస్తారు. చెగ్‌.ఓఆర్‌టీ వైబ్‌సైట్‌ వివిధ దశల్లో వడపోత అనంతరం తుది విజేతను నవంబర్‌ 10న ప్రకటించనున్నారు.

Social Share Spread Message

Latest News