
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, మస్క్‌తో విభేదాలపై ట్రంప్ తాజాగా స్పందించారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మస్క్‌పై అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. మస్క్ అద్భుతమైన వ్యక్తి. తెలివైనవారు. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విషయాల్లో ఆయన చాలా బాగా పనిచేశారు అంటూ ప్రశంసించారు. ఎలక్ట్రిక్ వాహన పన్ను క్రెడిట్ రద్దు నిర్ణయంపై మస్క్ కలత చెందారని అధ్యక్షుడు తెలిపారు. అది అతడికి కఠిన నిర్ణయమే అయినప్పటికీ, ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ కారును కొనాలని తాను కోరుకోనని ట్రంప్ వ్యాఖ్యానించారు.















