ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కానిస్టేబుల్ కనకం, ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా చిత్రాలు అద్భుతంగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయని, రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్‌లో స్ట్రీమ్ అవుతున్నాయని సదరు చిత్రాల మేకర్స్ తెలియజేస్తూ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ కనకం లో టైటిల్ రోల్ చేసిన వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ ట్రూ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కానిస్టేబుల్ కనకం. ఇలాంటి మంచి సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. అలాగే, ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా టీమ్స్‌కు కూడా నా అభినందనలు అన్నారు. ఈ వేడుకలో నాయిక వర్ష బొల్లమ్మ, డైరెక్టర్ ప్రశాంత్, ప్రొడ్యూసర్ సాయిబాబా, రచయిత బివిఎస్ రవి, డైరెక్టర్ సందీప్ రాజ్, నటులు చైతన్యరావు, హర్ష, డైరెక్టర్ జోసఫ్, డైరెక్టర్ సన్నీ, ఈటీవీ ప్రతినిథులు సాయికృష్ణ, నితిన్ చక్రవర్తి తదితరులు పాల్గొని తమ విజయానందాన్ని వ్యక్తం చేశారు.
















