Namaste NRI

మరో బాదుడు.. నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాలపై

నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాల జారీ కోసం కొత్తగా ఇంటెగ్రిటీ వీసా ఫీజును అమెరికా ప్రవేశపెట్టింది. ఈ ఫీజు ఎఫ్‌-1, ఎఫ్‌-2 వీసాలు, జే-1, జే-2 వీసాలు, హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాలతోపాటు టూరిస్టు-బీ-1/బీ-2 తదితర వీసాలకు వర్తిస్తుంది. వీసా ఇంటెగ్రిటీ ఫీజు తప్పనిసరి. దీన్ని రద్దు చేయడం లేదా తగ్గించడం కుదరదు. అయితే వీసా నిబంధనలను పూర్తిగా పాటించిన దరఖాస్తుదారులకు ఈ ఫీజును ప్రభుత్వం వాపసు చేస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరం కోసం ఇంటెగ్రిటీ ఫీజు సుమారు 250 డాలర్లు(రూ. 22 వేలు) లేదా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) నిర్ణయించిన మేరకు ఉండనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events