Skip to main content

Namaste NRI

పారిస్‌లో మంత్రి కేటీఆర్‌ బిజీబిజీ.. తొలిరోజు నుంచే ప్రముఖులతో భేటీ

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ బిజి బిజీగా గడుపుతున్నారు. తన తొలి రోజు పర్యటనలో భాగంగా ఆ దేశ డిజిటల్‌ అఫైర్స్‌ అంబాసిడర్‌ హెన్రీ వర్డియర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఫ్రాన్స్‌ మధ్య ఇన్నోవేషన్‌, డిజిటలైజేషన్‌, ఓపెన్‌ డాటా వంటి అంశాల్లో పరస్పర సహకారం అందించుకొనే అవకాశాలపై చర్చించారు. తెలంగాణలో ఇన్నోవేషన్‌, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తీసుకొంటున్న చర్యలను, ఓపెన్‌ డాటా పాలసీ గురించి, డిజిటల్‌ ఇన్‌ఫ్రా చర్యలపై మంత్రి కేటీఆర్‌, హెన్రీకి వివరించారు. ఈ సమాశంలో ఫ్రాన్స్‌లో భారత డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ కేఎం ప్రపుల్ల చంద్ర శర్మ, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

                అక్టోబర్‌ 29 ఫ్రాన్స్‌ ఎగువ సభలో జరిగే యాంబిషన్‌ ఇండియా 2021 సదస్సులో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారు. గ్రోత్‌`డ్రాఫ్టింగ్‌ ప్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌ ఎరా అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం పలువురు ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమవుతారు. తెలంగాణలో పెట్టుబడులు, అవకాశాలపై వారికి వివరిస్తారు. ఫ్రాన్స్‌ ప్రధాని ఇమ్మాన్యూయెల్‌ మాక్రాన్‌ సారథ్యంలో యాంబిషన్‌ ఇండియా 2021 పేరుతో వాణిజ్య సదస్సు జరుగనున్నది.

……………..

Social Share Spread Message

Latest News