Namaste NRI

ఈ చిత్రం నా కుతూరుకు ఓ బహుమతి : అర్జున్‌

అర్జున్‌ సర్జా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం సీతా పయనం. నిరంజన్‌, ఐశ్వర్య అర్జున్‌ జంటగా తెరకెక్కిన ఈ ఫీల్‌గుడ్‌ ప్రేమకథ ఈ నెల 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అర్జున్‌ మాట్లాడారు. సీతా పయనం ఓ డిఫరెంట్‌ జానర్‌. నా కూతుర్ని పాజిటివిటీ ఉన్న ఓ మంచి కథతో పరిచయం చేయాలనుకున్నాను. దానికి కార్యరూపమే ఈ సినిమా. ఇది నా కుమార్తెకు నేనిస్తున్న బహుమతి. ఇందులో ఐశ్వర్యను చూసి అంతా మెచ్చుకుంటారు. ముఖ్యంగా సత్యరాజ్‌ కాంబినేషన్‌ సీన్స్‌ ఈ సినిమాకు హైలైట్‌. నిరంజన్‌ అద్భుతంగా నటించాడు. ప్రతి ఒక్కరూ ప్రేమించేలా ప్రకాష్‌రాజ్‌ పాత్ర ఉంటుంది. నేను, ధృవ అతిథిపాత్రల్లో కనిపిస్తాం. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుంది అని అన్నారు.

ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇది తనకు కేవలం సినిమా మాత్రమే కాదని, ఓ ఎమోషన్‌ అనీ ఐశ్వర్య అర్జున్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరో నిరంజన్‌ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events