ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా కె.రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ లవ్‌స్టోరీ రాధేశ్యామ్. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. ఈ సినిమాలోని ఈ రాతలే.. దోబూచులే అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఎవరో వీరెవరో.. కలవని ఇరు ప్రేమికులా! ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా వీరి దారొకటే.. మరి దిక్కులే వేరులే అంటూ ఈ పాట సాగుతుంది. జస్టిస్ ప్రభాకరన్ స్వరపరచిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. వంశీ ప్రమోద్, ప్రసీద నిర్మాతలు. .














