Namaste NRI

అంగరంగ వైభవంగా ఆస్కార్ అవార్డుల వేడుక.. విజేతలు వీళ్ళే

హాలీవుడ్ సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల వేడుకగా పేరుగాంచిన 98వ అకాడమీ అవార్డ్స్ ఈసారి కూడా అట్టహాసంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఈ అవార్డుల కార్యక్రమంలో పలు చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుని ప్రత్యేక గుర్తింపు పొందాయి. ముఖ్యంగా ఫ్రాంకెన్‌స్టైన్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, సిన్నర్స్ వంటి చిత్రాలు పలు కేటగిరీల్లో విజేతలుగా నిలిచి ఈ ఏడాది అవార్డుల వేడుకలో తమదైన ముద్ర వేశాయి.

ఈ వేడుకలో టెక్నికల్ విభాగాల్లో ఫ్రాంకెన్‌స్టైన్ చిత్రం విశేషంగా మెరిసింది. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ఈ చిత్రం అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రానికి టమారా డెవరెల్ ప్రొడక్షన్ డిజైన్ నిర్వహించగా, షేన్ వియో సెట్స్ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. ఈ విభాగంలో హామ్నెట్, మార్టీ సుప్రీమ్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, సిన్నర్స్ చిత్రాలు కూడా నామినేషన్లు పొందాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవతార్: ఫైర్ అండ్ అష్ చిత్రం విజేతగా నిలిచి మరోసారి తన సాంకేతిక ప్రతిభను చాటుకుంది. ఈ చిత్రానికి జో లెటెరి, రిచర్డ్ బెనెహామ్, ఎరిక్ సైన్డన్, డానియెల్ బారెట్ విజువల్ ఎఫెక్ట్స్ అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఈ ప్రతిష్టాత్మక వేడుకకు హాలీవుడ్​తో పాటు ఇత‌ర ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. కళ్లు చెదిరే ఔట్​ఫిట్స్​ను ధరించి రెడ్​కార్పెట్​పై మెర‌వ‌గా, వారికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి రెడ్​ కార్పెట్​పై మెరవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

విజేతల జాబితా ….
ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్‌ (వెపన్స్‌)
ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: కెపాస్‌ డెమన్‌ హంట్స్‌
ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ది గర్ల్‌ హు క్రైడ్‌ పెరల్స్‌
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: ఫ్రాంకిన్‌ స్టన్‌
ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: ఫ్రాంకిన్‌ స్టన్‌
ఉత్తమ క్యాస్టింగ్‌: వన్‌ బ్యాటిల్‌ ఆప్టర్‌ అనదర్‌
ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ది సింగర్స్‌, టూ పీపుల్‌ ఎక్ఛ్సేంజ్‌ సలైవా
ఉత్తమ స్క్రీన్‌ప్లే : ర్యాన్‌ కూగ్లర్‌
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: సిన్నర్స్‌
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌: మిస్టర్‌. నోబడీ ఎగనెస్ట్‌ పుతిన్‌
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌: ఆల్‌ ది ఎంప్టీ రూమ్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events