Namaste NRI

అమెరికా అప్పు ఎంతో తెలుసా?

ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన కొన్ని వారాలకే అమెరికా జాతీయ రుణం రికార్డు స్థాయిలో 39 ట్రిలియన్‌ డాలర్లను (సుమారు రూ. 3,627 లక్షల కోట్లు) దాటి ఒక ప్రధాన ఆర్థిక మైలురాయిని చేరుకుంది. పన్ను కోతలు, పెరుగుతున్న రక్షణ వ్యయం, అప్పులను నియంత్రించే ప్రయత్నాలు వంటి పరస్పర విరుద్ధమైన విధాన ప్రాధాన్యతల ఒత్తిడిని ఈ పెరుగుదల స్పష్టం చేస్తున్నదని, అధ్యక్షుడు ట్రంప్‌ ఇచ్చిన కీలక హామీల్లో అప్పుల నియంత్రణ ఒకటని సీఎన్‌బీసీ నివేదిక పేర్కొన్నది. పెరుగుతున్న రుణ భారం ఆర్థిక పరిస్థితిపై విస్తృతమైన పర్యవసానాలకు దారితీయగలదని నిపుణులు హెచ్చరించారు. రుణ వృద్ధి వేగాన్ని ఆందోళనకరంగా అభివర్ణించిన పీటర్‌ జీ పీటర్సన్‌ ఫౌండేషన్‌కు చెందిన మైఖేల్‌ పీటర్సన్‌ ఇది భవిష్యత్‌ తరాలపై గణనీయమైన ఆర్థిక భారాన్ని మోపుతుందని హెచ్చరించారు.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events