Namaste NRI

టెక్‌ ప్రపంచానికి ఏఐ సెగ … లేఆఫ్స్‌తో మరోసారి చర్చ

30 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఒరాకిల్‌ తీసుకొన్న నిర్ణయం టెక్‌ రంగంలో సంచలనం సృష్టిస్తున్నది. భారత్‌లోనే 12 వేల మంది ఉద్యోగులపై వేటు పడటం ఆందోళన కలిగిస్తున్నది. టెక్‌ రంగంలో ఈ కోతలు ఒరాకిల్‌కే పరిమితం కాబోవని, రాబోయే రోజుల్లో పలు సంస్థలు లేఆఫ్‌ బాటపట్టే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్‌ వైపు పలు కంపెనీలు దృష్టిసారించడంతో సంప్రదాయ కోడింగ్‌ జాబ్స్‌ మనుగడ ప్రశ్నార్థకమవుతున్నట్టు ఈ సందర్భంగా నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేఆఫ్‌లు పెరుగుతున్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ సర్వీస్‌) కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారు ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ముఖ్యమని సలహానిస్తున్నారు. మొత్తంగా ఏఐ సెగ సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీకి మరిన్ని గడ్డు పరిస్థితులను తీసుకురావొచ్చని హెచ్చరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events