Skip to main content

Namaste NRI

అమెరికాలో ఘోరం.. క్రిస్మస్ పరేడ్ పైకి

అమెరికాలోని విస్కన్‌సిన్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్‌ పండగను పురస్కరించుకుని మిల్‌వాకీ శివారులోని వాకీషా టౌన్‌లో సంప్రదాయ వార్షిక పరేడ్‌ను నిర్వహించారు. వందలాది మంది ఉల్లాసంగా పాటలు పాడుతూ ర్యాలీగా వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఓ ఎస్‌యూవీ బారికేడ్లను డీకొట్టి మనుషులపై నుంచి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న పోలీసు అధికారి కారుపై కాల్పులు జరిపి అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ డ్రైవర్‌ ఆగకుండా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఈ ఊహించని  పరిణామంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  క్షతగాత్రుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనకు కారణమైన ఎస్‌యూవీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.  అయితే ఘటనకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Social Share Spread Message

Latest News