
సువిక్షిత్, గీతికా రతన్ జంటగా యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఫీల్‌గుడ్ లవ్ డ్రామా దూరదర్శిని. కలిపింది ఇద్దరిని అనేది ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు. ఎం.జయశంకర్‌రెడ్డి, పాటిమీది సంతోష్ నిర్మాతలు. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ, పల్లెటూరిలో విహరించిన అనుభూతిని కలిగించే ఫీల్‌గుడ్ సినిమా ఇదని, మనసులకు హత్తుకునేలా, యువతకు, సమాజానికి నచ్చేలా సినిమా ఉంటుందని, 90ల నాటి గోల్డెన్ డేస్‌ని గుర్తు చేసే సినిమా ఇదని, పతాక సన్నివేశాలు ఆలోచింపజేస్తాయని దర్శకుడు కార్తికేయ కొమ్మి అన్నారు. ఈ నెల 15న సినిమా విడుదల కానున్నది.















