Skip to main content

Namaste NRI

తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పిన కేంద్ర హోంమంత్రి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ గిరిజన మ్యూజియాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. మణిపూర్‌లో రాణిగైడిన్లు గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంకు వర్చువల్‌ ద్వారా అమిత్‌ షా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌లకు రూ.110 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. గిరిజన మ్యూజియాలకు మొత్తం రూ.195 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.  తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో గిరిజన మ్యూజియంలను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌  వినిపిస్తోంది. కేంద్రానికి కూడా వివిధ సందర్భాల్లో  ప్రజా ప్రతినిధులు విన్నవించారు. ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్‌ షా మ్యూజియంలకు నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తెలుగు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News