Namaste NRI

వాటిని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేస్తాం: ట్రంప్‌

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమ ఆధీనంలోకి తీసుకుని తీరుతామని ట్రంప్‌ హెచ్చరించారు. హొర్ముజ్‌ జలసంధి గుండా వెళ్లే నౌకలపై సుంకాలు విధించే ఏ ప్రయత్నాలనైనా అమెరికా వ్యతిరేకిస్తుందని కూడా ఆయన అన్నారు. దాదాపు ఆయుధ స్థాయి అణు సామగ్రిని ఇరాన్‌ వద్ద ఉంచుకోవడానికి అమెరికా అనుమతించబోదని ఆయన స్పష్టం చేశారు. వైట్‌ హౌస్‌ వద్ద విలేకరులతో ట్రంప్‌ మాట్లాడుతూ యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకొని, వాటిని నిర్వీర్యం చేస్తామని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events