Namaste NRI

విశ్వనాథ్ అండ్ సన్స్.. రిలీజ్ డేట్ ఫిక్స్

సూర్య నటిస్తున్న తొలి తెలుగు స్ట్రెయిట్‌ చిత్రం విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుందని, సుదీర్ఘ విరామం తర్వాత సూర్య నటించిన ఫుల్‌లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇదని, హృదయాన్ని కదిలించే కుటుంబ భావోద్వేగాలు, వినోదంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని చిత్రబృందం తెలిపింది. 45ఏళ్ల కథానాయకుడిపై ఇష్టం పెంచుకునే ఇరవైఏళ్ల అమ్మాయి, వారి బంధం తాలూకు భావోద్వేగాలు కథలో కీలకంగా ఉంటాయని సమాచారం.

మమితా బైజు, రాధికా శరత్‌కుమార్‌, రవీనా టాండన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 14న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌, బ్యానర్స్‌: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events