Namaste NRI

నా తొలి ప్రయత్నాన్ని జనం ఆదరిస్తారని నమ్మకం ఉంది : శేఖర్‌ మోడల్‌

శేఖర్‌ మోడల్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఒక్క అడుగు. ఈ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సినీప్రముఖులు వీఎన్‌ ఆదిత్య, అశోక్‌కుమార్‌, వి.సముద్ర, పద్మిని నాగులపల్లి, రామసత్యనారాయణ, సత్య మాస్టర్‌ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై, చిత్ర టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

నటుడు, దర్శక,నిర్మాత శేఖర్‌ మోడల్‌ మాట్లాడుతూ నాకు నేనే అవకాశాన్ని కల్పించుకుంటూ ఈ ఒక్క అడుగు సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా కోసం బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ చాలా చేశాను. ఆడిషన్‌ చేసి టాలెంట్‌ ఉన్నవారిని మాత్రమే నటీనటులుగా తీసుకున్నాను. సాంకేతికంగా కూడా సినిమా ఆకట్టుకుంటుంది. నా ఈ తొలి ప్రయత్నాన్ని జనం ఆదరిస్తారని నమ్మకం ఉంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: సతీశ్‌ ముత్యాల, సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, నిర్మాణం: సిరి క్రియేషన్స్‌.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events