Skip to main content

Namaste NRI

రావు బహదూర్ తెలుగు ప్రేక్షకులు గర్వపడే సినిమా : హీరో సత్యదేవ్

సత్యదేవ్‌ హీరోగా రూపొందుతున్న సైకలాజికల్‌ డ్రామా రావు బహదూర్‌. వెంకటేశ్‌ మహా దర్శకుడు. చింతా గోపాలకృష్ణరెడ్డి, అనురాగ్‌రెడ్డి, శరత్‌చంద్ర నిర్మాతలు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్‌ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాట్‌ ఏ టీజర్‌ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో సత్యదేవ్‌ మాట్లాడారు. తెలుగులో ఓ క్రేజీ మూవీ వచ్చిందని అంతా గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుంది. మనం విదేశాలకు వెళ్లినప్పుడు బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాల గురించి ఎలా చెప్పుకుంటామో రావు బహదూర్‌ గురించి కూడా అలా చెప్పుకుంటారు. ఇది నా ప్రామిస్‌. దర్శకుడు వెంకటేశ్‌ మహా ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు. ప్యాషన్‌ ఉన్న వారంతా కలిసి పనిచేసిన సినిమా ఇది. జూలై 4 నా పుట్టినరోజు. ఈ సినిమాను చూసి, నా బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తారని ఆశిస్తున్నా అని హీరో సత్యదేవ్‌ అన్నారు.

ఈ సినిమాకోసం ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చిందని, ఈ పాత్రకోసం సత్యదేవ్‌ చాలా కష్టపడ్డారని, అద్భుతంగా నటించారని దర్శకుడు వెంకటేష్‌ మహా అన్నారు. ఇంకా కథానాయిక దీపా థామస్‌తోపాటు నిర్మాతలు కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News