
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని అమలు చేసే క్రమంలో నావికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని ట్రంప్‌ను కోరారు. హొర్ముజ్ జలసంధి వద్ద అమెరికా సైనిక దాడుల్లో ఒక వాణిజ్య నౌకకు చెందిన ముగ్గురు భారతీయ సిబ్బంది మరణంపై భారత్‌లో ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఇక్కడ జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆ ఇద్దరు నాయకుల మధ్య భేటీ జరిగింది. భారత్‌ను విశ్వసనీయ భాగస్వామిగా అభివర్ణించిన ట్రంప్ భారత్‌పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా దాన్ని రక్షిస్తుందని అన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణలకు ముగింపు పలికేందుకు ట్రంప్ చేసిన కృషిని ప్రధాని మోదీ అభినందించారు.





























