Skip to main content

Namaste NRI

దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం

దక్షిణ కొరియా లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లిథియం బ్యాటరీ తయారీ కేంద్రం లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. రాజధాని సియోల్‌కు దక్షిణంగా హ్వాసోంగ్‌ లో ఉన్న లిథియం బ్యాటరీ తయాకీ కేంద్రంలో  మంటలు చెలరేగినట్లు తెలిసింది. దాదాపు 35 వేల యూనిట్లు ఉన్న గిడ్డంగిలో బ్యాటరీ సెల్స్‌ వరుస పేలడంతో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారి కిమ్‌ జిన్‌-యంగ్‌ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 20 మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపింది. తీవ్రంగా గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నివేదించింది.

Social Share Spread Message

Latest News