Skip to main content

Namaste NRI

అమ్మాయిలకు నచ్చే చిత్రం .. అందాల రాక్షసి

షెరాజ్‌ మెహదీ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్వకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఓ అందాల రాక్షసి. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లు. స్కై ఈజ్‌ ది లిమిట్‌ బ్యానర్‌ మీద సురీందర్‌ కౌర్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 2న రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌ నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో షెరాజ్‌ మెహదీ మాట్లాడుతూ ఒక ఏడాదికి ఓ మంచి సినిమా వస్తుంది. అలాంటి సినిమానే మాది కూడా. అద్భుతమైన కంటెంట్‌తో రాబోతోన్న మంచి సినిమా. ఆడియెన్స్‌కి ఒక్క నిమిషం కూడా బోర్‌ కొట్టదు. మంచి సందేశాత్మక కథతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇందులోని ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి. అమ్మాయిలకు నచ్చే చిత్రం అవుతుంది అని అన్నారు. ఈ సినిమాకు కథ, మాటల్ని రాశాను. థియేటర్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ మంచి ఫీల్‌తో బయటకు వస్తారు. నేటి తరం ఆడపిల్లలు ఎలా ఉండాలనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని చేశాం. మా హీరో షెరాజ్‌ అద్భుతంగా నటించారు. డైరెక్టర్‌గా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, హీరోగా ఇందులో మ్యాజిక్‌ చేశారు అని కథ, మాటల రచయిత భాష్య శ్రీ చెప్పారు.

Social Share Spread Message

Latest News