Skip to main content

Namaste NRI

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన గ్యాంగ్ లీడర్ హీరోయిన్

గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక ఆరుళ్ మోహన్‌ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. చక్కటి అందం, అభినయంతో యువతరంలో క్రేజ్‌ సంపాదించుకుంది. ప్రస్తుతం తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు కొంతకాలంగా తెలుగులో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నది. ఈ భామ నిరీక్షణ ఫలించింది. తెలుగులో పవన్‌కల్యాణ్‌ సరసన నటించే బంపరాఫర్‌ను చేజిక్కించుకుంది.  పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని మొదలుపెట్టారు. త్వరలో ముంబయిలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులో పవన్‌కల్యాణ్‌ శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించబోతున్నారు.  ఈ చిత్రంలో పవన్ సరసన కథానాయికగా ప్రియాంక ఆరుళ్ మోహన్‌ను దర్శకుడు సుజీత్ ఎంపిక చేశారని తెలిసింది. గ్యాంగ్‌స్టర్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

Social Share Spread Message

Latest News