Namaste NRI

రష్యాలో భారీ స్కామ్ గుట్టురట్టు.. భారత్‌ సహా లక్షలాది మంది

రష్యాలో భారీ స్కామ్‌ వెలుగుచూసింది. భారత్‌ సహా 50కిపైగా దేశాల్లోని లక్ష మందికిపైగా పౌరులను మోసగించిన నకిలీ కాల్‌ సెంటర్‌ గుట్టును ఆ దేశ ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (ఎఫ్‌ఎస్‌బీ) ఛేదించింది. పెట్టుబడుల నెపంతో ఈ ముఠా భారత్‌కు చెందని పలువురిని కూడా లక్ష్యంగా చేసినట్టు ఎఫ్‌ఎస్‌బీ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను ఎఫ్‌ఎస్‌బీ షేర్‌ చేసింది. భారీ యెత్తున మోసాలకు పాల్పడే అంతర్జాతీయ వ్యవస్థీకృత ముఠా ఈయూ, యూకే, కెనడా, బ్రెజిల్‌, భారత్‌, జపాన్‌ ప్రజలను లక్ష్యంగా చేసుకు నేది.పెట్టుబడులు, ఇతర ఆర్థిక ప్రలోభాల పేరుతో పౌరులను మోసగించి రోజుకు 1 మిలియన్‌ డాలర్లు (రూ.8 కోట్లు) వరకు ఆదాయం పొందేది. ఈ కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు తరచూ భారత్‌కు చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకునే వారు.

డిజిటల్‌ లావాదేవీల్లో ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్‌ ఉన్న భారత్‌ పౌరులను అధిక వడ్డీ, నకిలీ బీమాల పేరుతో వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడే వారు. కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్న ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రష్యాలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పును వ్యాప్తి చేయడానికి ఈ కాల్‌సెంటర్‌కు 2022లో ఉక్రెయిన్‌కు చెందిన ఎస్‌బీయూ సెక్యూరిటీ సంస్థ నుంచి ఆదేశాలు వచ్చాయని ఎఫ్‌బీఐ వెల్లడించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events