Skip to main content

Namaste NRI

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. సెప్టెంబరు 1 నుంచి

తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు పున ప్రారంభం కానన్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూతపడ్డ విద్యాసంస్థల ప్రారంభంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.    విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులుతో  చర్చలు జరిపిన అనంతరం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు పున ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ విద్యార్థులు కచ్చితంగా మాస్కులు ధరించాలి. ఈ నెల 30 లోపు తరగతి గదులు, హాస్టళ్లు, అన్ని విద్యాసంస్థల శానిటైజేషన్‌ ప్రక్రియ పూర్తి కావాలి. విద్యాసంస్థల్లో తప్పని సరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలి అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు తెరవనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events