Skip to main content

Namaste NRI

వీక్షణం మూవీ నుంచి ఎన్నెన్నో లిరికల్ సాంగ్ రిలీజ్

రామ్‌ కార్తీక్‌, కశ్వి జంటగా నటిస్తున్న చిత్రం వీక్షణం. మనోజ్‌ పల్లేటి దర్శకుడు. పద్మనాభ సినీ ఆర్ట్స్‌ పతాకం పై పి.పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఎన్నెన్నో అనే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. మెలోడీ ప్రధాన ప్రేమగీతంగా ఈ పాటను తీర్చిదిద్దారు. సమర్థ్‌ గొల్లపూడి సంగీతాన్ని అందించిన ఈ పాటను రెహ్మాన్‌ రాయగా సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. సస్పెన్స్‌, మిస్టరీ, థ్రిల్లింగ్‌ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, చిత్రీకరణ పూర్తయిందని మేకర్స్‌ తెలిపారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.  ఈ చిత్రానికి కెమెరా: సాయిరామ్‌ ఉదయ్‌, సంగీతం: సమర్థ్‌ గొల్లపూడి, దర్శకత్వం: మనోజ్‌ పల్లేటి.

Social Share Spread Message

Latest News