శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్ కామ్రేడ్ కళ్యాణ్. మహిమా నంబియార్ కథానాయిక. జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మాతలు. కోన వెంకట్ సమర్పకుడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌లో శ్రీవిష్ణు మాట్లాడారు. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఇందులో కొన్ని భారీ డైలాగులు కూడా చెప్పాను. వాటిని మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబంతో పాటు పిల్లలకు కూడా నచ్చే సినిమా కామ్రేడ్ కళ్యాణ్. ఈ కథలోని పాయింట్ సీరియస్‌గానే ఉంటుంది. దీన్ని ఏ భాషలో అయినా చేయొచ్చు. దానికి మేం నక్సల్స్ నేపథ్యాన్ని జోడించడంతో ఇంకాస్త అందం వచ్చింది. మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది అని హీరో శ్రీవిష్ణు అన్నారు.

ఈ రోజు మా కామ్రేడ్ కల్యాణ్, రేపట్నుంచి కామెడీ కళ్యాణ్ అవుతాడు. ఈ సినిమాతో మాది రెండేళ్ల జర్నీ. ఒరిస్సా, తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల్లో ఎవరూ తీయని లోకేషన్లలో ఈ సినిమా చిత్రీకరణ జరిపాం. ఎక్కడా రాజీపడలేదు. శ్రీవిష్ణు కెరీర్‌లోనే మోస్ట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే సినిమా ఇది అని సమర్పకుడు కోనవెంకట్ చెప్పారు. ఇంకా దర్శకుడు జానకిరామ్, నిర్మాత వెంకటకృష్ణ కూడా మాట్లాడారు.ఈ నెల 9న సినిమా విడుదల కానున్నది.















