Skip to main content

Namaste NRI

భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం

ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన చెన్నపాటి జగదీష్‌ ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ను ఆస్ట్రేలియా అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ (ఏఎన్‌యూ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ఆ దేశంలోని ప్రముఖ సైన్స్‌ సంస్థలలో ఒకటి. ఇది ఆస్ట్రేలియన్‌ పార్లమెంట్‌, ప్రజలకు స్వతంత్ర మరియు అధికారిక శాస్త్రీయ సలహాలను అందిస్తుంది.  ఈ బాధ్యతలు చేపట్టనున్న తొలి భారత సంతతి వ్యక్తి జగదీషే కావడం విశేషం. 2022 మేలో ఆయన తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.  ఈ అరుదైన అకాశం పట్ల జగదీష్‌ ఆనందం వ్యక్తం చేశారు. 31 ఏళ్ల క్రితం రెండేళ్ల కాంట్రాక్టుతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తాను ఇంత గొప్ప స్థాయికి చేరుతానని కలలో కూడా ఊహించలేదన్నారు.

                 జగదీష్‌  స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని వల్లూరు పాలె. నాగార్జున యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందారు. 9977లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. అనంతరం 1988లో ఢల్లీి యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి, కొన్నాళ్లు కెనడాలో ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆ తర్వాత 1990లో ఆస్ట్రేలియాకు వెళ్లారు.

Social Share Spread Message

Latest News