స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో తారక్ సభ్యత్వం సాధించారు. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని కొమురం భీమ్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ స్టార్ హీరో. ఇక అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. అందులో ఎన్టీఆర్ పేరును అధికారికంగా ప్రకటించింది. భారత సినీ పరిశ్రమ నుంచి ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కొత్త సభ్యుడిగా చోటు దక్కించుకోడం విశేషం. తెలుగు సినిమాకు లభించిన అరుదైన గౌరమిదని ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.














