Skip to main content

Namaste NRI

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం.. ఆస్కార్ కమిటీ ఆహ్వానం

దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దంపతులకు మరో అరుదైన గౌరవం లభించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ తో తెలుగు సినిమాను ఆస్కార్‌ స్థాయికి తీసుకెళ్లారాయన. దర్శకుడిగా రాజమౌళి సాధించిన ఘనత అసామాన్యం. ఇప్పుడు ఆయనతోపాటు ఆయన సతీమణి రమా రాజమౌళి కూడా ఓ ఘనతను సాధించారు. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అకాడమీలో చేరేందుకు ఈ జంటకు ఆహ్వానం అందింది.దర్శకుల కేటగిరిలో రాజమౌళి, కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా రమా రాజమౌళి ఈ గౌరవం దక్కించుకున్నారు.

 ఈ ఏడాది 57 దేశాలనుంచి 487మందికి ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానాలు పంపగా, మన దేశం నుంచి ఈ జంటతో పాటు షబానా ఆజ్మి, రితేశ్‌ సిద్వానీ, రవివర్మన్‌ తదితరులు ఈ అహ్వానం అందుకున్నవారిలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆస్కార్‌ అకాడమి తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన కళాకారులకు ఆహ్వానం పలకడం పట్ల అకాడమి ఆనందం వెలిబుచ్చింది.

Social Share Spread Message

Latest News