టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని సామ్ కు ఆహ్వృానం అందింది. ఆగస్టు 12 నుంచి ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు జరగనున్నాయి. తనకు ఇన్విటేషన్ రావడం పట్ల సామ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిద్యం వహించడం నాకు గర్వంగా ఉంది. దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారతీయ సినిమాలను, భారతీయులు, సినీ ప్రేమికులు, ఇతరులందరిని ఇలా ఒక్కచోట చేర్చడం అనేది ఒక గొప్ప అనుభూతి అన్నారు.














