Skip to main content

Namaste NRI

భారత సంతతి వ్యక్తికి అరుదైన అవకాశం

కెనడాలో భారత సంతతికి చెందిన ఓ శాసనసభ్యుడు చంద్ర ఆర్యకు అరుదైన అవవకాశం దక్కింది. ఇటీవల ఆయన కెనడా పార్లమెంటులో తన మాతృభాష కన్నడలో కొద్దిసేపు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మాతృభాషలో మాట్లాడేందుకు తనకు అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కెనడాలో నివసిస్తున్న ఐదు కోట్ల కనడా ప్రజలకు ఇది గర్వకారణమని వ్యాఖ్యానించారు. నువ్వు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే కన్నడిగుడిగానే జీవించు అంటూ ప్రముఖ కన్నడ కవి రచించిన పాట గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కాగా, చంద్ర ఆర్య 2015లో తొలిసారిగా కెనడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించి రెండో సారి పార్లమెంటులో అడుగుపెట్టారు.

Social Share Spread Message

Latest News