బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు పదవీ గండం పొంచి ఉంది. ఉప ఎన్నికలు జరిగిన రెండు కీలక స్థానాల్లో అధికార పార్టీ సభ్యులు ఓటమి పాలయ్యారు. ఇంగ్లండ్‌లోని వేక్ఫీల్డ్, హోనిటన్`ట్రివెర్టన్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార కన్జెర్వేటివ్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. దీంతో జాన్సన్‌కు ఇది పెద్ద షాకే. ఇటీవల పార్లమెంట్లో ఆయన అవిశ్వాసాన్ని కూడా ఎదుర్కొన్నారు. తాజా ఫలితాలు అత్యంత పేలవమైనవి. మునుపటి మాదిరిగా కార్యలాపాలు సాగించడం ఇక అసాధ్యం అంటూ డొడెన్ తన రాజీనామా పత్రంలో ఏర్కొన్నారు. దీనర్థం జాన్సన్‌ను ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు తన వెంట రావాల్సిందిగా పార్టీ నేతలకు పిలుపు ఇవ్వడమేనని పరిశీలకులు అంటున్నారు.














